: కోడిలాంటి కొత్త డైనోసార్ గుర్తింపు
సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న ఒక కొత్తరకం డైనోసార్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ డైనోసార్ కోడిని పోలివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 అంగుళాల పొడవుతో ఉన్న ఈ జీవికి పళ్లుకూడా ఉన్నాయట. ఇది కీటకాలను తింటూ జీవనం గడిపేదట.
బ్రెస్సిల్స్‌కు చెందిన రాయల్ బెల్జియం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ కు చెందిన పరిశోధకుడు పాస్కల్ గోడ్ ఫ్రాయిట్ మాట్లాడుతూ, ఇది రాక్షస బల్లి జాతిలో ఆరోర్నిస్ క్సుయ్ తరగతికి చెందినది అన్నారు. దీన్ని చైనాలోని లియాయోనింగ్ ప్రావిన్స్‌లో కనుగొన్నారు. నాలుగు రెక్కలు కూడా ఉన్న ఈ జీవికి ఎగిరే సామర్ధ్యం కూడా ఉందట. ఈ శిలాజం ద్వారా పక్షుల ఆవిర్భావానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.