: టికెట్ల దొంగలు ఆర్టీసీ అధికారులే: అభీబస్
ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ల లో అక్రమాల వ్యవహారంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ బుకింగ్ ఏజెంట్లు అక్రమాలకు పాల్పడకుండా ఇస్తున్న వన్ టైమ్ పాస్ వర్డ్ లను తొలగించాలని అర్టీసీ అధికారులే తమను కోరారని ఆ సంస్థకు సాంకేతిక సాయం అందిస్తున్న అభీబస్ యాజమన్యం ప్రకటించింది. పాస్ వర్డ్ తొలగించాలంటూ ఫిబ్రవరి 20 న ఆర్టీసీ బస్ భవన్ నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందాయని, అందుకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని వాటిని దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ పోలీసులకు ఇచ్చినట్టు ఆ సంస్ధ సీఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. వన్ టైం పాస్ వర్డ్ లు తొలగించిన తరువాతే ఏజెంట్లు అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో తమకెలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.