: తెలంగాణకు డెడ్ లైన్లు పెట్టొద్దు: సీఎం
తెలంగాణ అంశంపై ఎవరూ డెడ్ లైన్లు పెట్టే సాహసం చేయొద్దని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణపై డెడ్ లైన్లకు పార్టీ తలొగ్గుతుందని తాను అనుకోవడం లేదన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తెలంగాణపై పరిష్కారం చూపే ఆస్కారముందని తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి, ఈ అంశంపై అందరూ వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన, దేశవ్యాప్తంగా ఇబ్బంది రాని పరిష్కారాన్ని సూచించాలని కేంద్రం ఆలోచిస్తోందన్న సీఎం, సున్నితమైన జఠిలమైన అంశానికి అనాలోచిత పరిష్కారాలు సూచించలేరని తెలిపారు.