: సింహగర్జనకు తెలంగాణ విద్యార్ధి జేఏసీ పిలుపు
తెలంగాణ విద్యార్జి జేఏసీ మార్చి 2వ తేదీన నిజాం కళాశాలలో విద్యార్థుల సింహగర్జనకు పిలుపునిచ్చింది. విద్యార్థి జేఏసీ స్టీరింగ్ కమిటీ ఈ రోజు హైదరాబాదులోని ఉస్మానియా యూనివెర్సిటీలో సమావేశమైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యార్థి జేఏసీ నేతలు, మార్చి 20న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను నిలబెడతామని, త్వరలోనే వారి పేర్లు కూడా ప్రకటిస్తామని వెల్లడించారు.