: 'ఇంటింటా అన్నమయ్య' జూన్ 14న విడుదలకు సన్నాహాలు
ఇంటింటా అన్నమయ్య సినిమా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు నిర్మాత యలమంచిలి సాయిబాబు తెలిపారు. నిర్మాత కుమారుడు రేవంత్ ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు వినసొంపైన సంగీతం అందించింది ఎంఎం కీరవాణి.