: అల్లు శిరీష్ 'కొత్త జంట' సినిమా ప్రారంభం
గౌరవం కథానాయకుడు అల్లు శిరీష్ కథానాయకుడిగా 'కొత్త జంట' సినిమా హైదరాబాద్ లో ప్రారంభం అయింది. అల్లు శిరీష్ కి ఇది రెండో సినిమా కాగా ఈ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. 'కొత్త జంట' సినిమాకి 'ఈరోజుల్లో', 'బస్టాప్' సినిమాలతో దర్శకుడిగా నిరూపించుకున్న మారుతి దర్శకత్వం వహించనున్నాడు. అన్నపూర్ణా స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు, దిల్ రాజు, హీరో సోదరుడు అల్లు అర్జున్, సురేష్ బాబు, నాగబాబు తదితరులు హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టగా, రామానాయుడు స్విచ్ ఆన్ చేసారు. జూన్ 20 నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో రెజీనా కథా నాయిక