: నాయకులు స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారు: మంత్రి బస్వరాజు సారయ్య


2014 లోపు తెలంగాణ వస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. గురువారం విశాఖ జిల్లా పరిషత్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, స్వార్థం కోసం కొంతమంది నాయకులు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. అధిష్ఠానానికి డెడ్ లైన్లు విధించడం, ఉద్యమం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని ప్రకటించడం అంతా డ్రామాగా అభివర్ణించారు. పార్టీ మారేందుకు ముందు నుంచే ఎంపీలు ప్రణాళికలు వేసుకున్నారన్నారు. మంత్రి వర్గ ఉపసంఘంలో చర్చించి, బీసీ ఉప ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కులాల విభజన కోసం త్వరలో బీసీ సంఘం వేస్తున్నామని సారయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News