: ఫోన్ కాల్ ప్రేమికులకు పోలీసు కౌన్సిలింగ్


గోదావరిఖనిలో అపరిచితుని ఫోన్ కాల్ తో ఆగిన పెళ్లి పోలీసుల జోక్యంతో ఓ కొలిక్కి వచ్చింది. ఫోన్ చేసిన యువకుడు, పెండ్లి కుమార్తె ప్రేమించుకున్నారని పోలీసులు నిర్ధారించుకోవడంతో, ఇద్దరూ పెళ్లికి అంగీకరించడంతో పెద్దల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పూర్వాపరాలలోకి వెళితే ... ఈ రోజు ఉదయం మరి కాసేపట్లో పెళ్లి జరగనుండగా పెళ్లి కొడుకుకి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. పెళ్లి కుమార్తె, తాను ప్రేమించుకున్నామని అతను తెలపడంతో ఈ పెళ్లి ఆగిపోయింది.

దీంతో పెళ్లి కుమర్తె తల్లిదండ్రులు అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లికొడుకు కనకయ్య ఫోన్ లో నమోదైన నెంబర్ ఆధారంగా, ఆ ఫోన్ చేసింది రమేష్ అనే వ్యక్తని నిర్ధారించుకున్నారు. తరువాత రమేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ... తాను, పెళ్ళికూతురు ప్రేమించుకున్నామని తెలపడంతో, ఆ యువతిని విచారించగా ఆమె కూడా అది నిజమేనని తెలిపింది. దాంతో కౌన్సిలింగ్ నిర్వహించగా ఆమె కూడా సదరు యువకుడ్ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో పోలీసులు పెద్దల్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసేందుకు అంగీకరించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News