: స్పాట్ ఫిక్సింగ్ పెద్దగా ప్రభావం చూపదు: ధోనీ
స్పాట్ ఫిక్సింగ్ పై సరైన సమయంలో స్పందిస్తామని టీమిండియా కెప్టెన్ ధోనీ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాడ్ వెళ్లిన టీమిండియా సారధి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఫిక్సింగ్ పై స్పందించమన్న మీడియా ప్రశ్నలకు ఇది సరైన సమయం, వేదిక కాదని తోసిపుచ్చారు. అయితే ఇలాంటి ఆరోపణలు సహజమని, ఇవి క్రికెట్ పై అంతగా ప్రభావం చూపవని చెప్పారు.