: జూన్ 2 న నిజాంగ్రౌండ్స్ సభలో టీఆర్ఎస్ లో చేరుతున్నాం: మందా, వివేక్


తెలంగాణపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం బాధించిందని, అందుకే తెలంగాణలోని ముగ్గురు దళిత ఎమ్మెల్యేలు పార్టీని వీడాల్సిన అవసరం ఏర్పడిందని ఎంపీ మందా జగన్నాధం తెలిపారు. స్వపక్షంలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చెయ్యడం చరిత్రలోనే లేదని, అయినా తాము చేసామని ఆయన తెలిపారు. మనసు చంపుకుని పార్టీలో కొనసాగలేమని, జూన్ 2న నిజాం కళాశాల మైదానంలో జరిగే సభలో టీఆర్ఎస్ లో చేరనున్నామని ఎంపీ మందా జగన్నాధం స్పష్టం చేసారు. సిద్దాంతం, సిద్దాంతం అని మాట్లాడే నేతలకు ఇచ్చిన మాట తప్పడమే సిద్దాంతమా? అని ప్రశ్నించారు. మరో ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రకటించకపోతే తాము రాజీనామా చేస్తామని ముందే అధిష్ఠానానికి తెలిపామన్నారు. ఈ క్రమంలో 30 న నిర్ణయం తీసుకుంటామని తెలిపామని, అనుకున్నట్టే కేంద్రం స్పందించకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నామని వివేక్ చెప్పారు.

  • Loading...

More Telugu News