: టీ కాంగ్రెస్ ఎంపీల కృషి అభినందనీయం: కేసీఆర్


కేశవరావు నాయకత్వం లో తెలంగాణ కోసం టీకాంగ్ ఎంపీలు అభినందనీయమైన ప్రయత్నాలు చేసారని కేసీఆర్ తెలిపారు. ఎంపీ వివేక్ ఇంట్లో టీ కాంగ్ ఎంపీలతో సమావేశానంతరం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణపై ఎంపీలు పలుమార్లు తమ పార్టీ అధిష్ఠానానికి ఎందుకు తెలంగాణ ఇవ్వాలో విన్నవించారని, ఆ క్రమంలో వారు 30 వరకూ ఆగి నిర్ణయం తీసుకుంటామన్నారని, అందుకే ఇంతవరకు ఆగామని తెలిపారు. అనుకున్నట్టే కేకే, వివేక్, జగన్నాధం, రాజయ్య, వినోద్ టీఆర్ఎస్ లో నిజాంగ్రౌండ్స్ లో జరుగనున్న సభలో చేరుతారని కేసీఆర్ స్పష్టం చేసారు. ఈ చేరికల్ని తాము రాజకీయ సమీకరణాలుగా చూడమని, పార్టీలోకి ఇతరులంతా తరలి వస్తారని తెలిపారు. 'తెలంగాణ బిడ్డలంతా బరిగీసి అడుగుతారు. అప్పుడు తెలంగాణ వస్తుంది' అని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News