: అక్టోబర్ లో డిఎస్సీ: పార్థసారధి
అక్టోబర్ లేదా నవంబర్ నెలలో డిఎస్సీ నిర్వహించనున్నట్టు రాష్ట్రమాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి వెల్లడించారు. హైదరాబాద్ కార్యాలయంలో మాట్లాడుతూ జూలైలో కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం మద్యం చైన్ దుకాణాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని తెలిపారు. గొలుసు దుకాణాలపై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారని, తనిఖీలు పూర్తి కాగానే మద్యం గొలుసు దుకాణాలన్నీ మూసివేయిస్తామని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముదే తనపై ఫెరా కేసు నమోదైందని అంతే తప్ప ప్రభుత్వ, ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడలేదని మంత్రి పార్థసారధి తెలిపారు.