: నోరు జారిన కేసీఆర్ పై కేసు


ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను పట్టుకుని 'వాచ్ మెన్ కంటే అధ్వానం' అంటూ గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై కేసు నమోదుకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది గొల్లపల్లి రామారావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ఖమ్మం ఫస్ట్ క్లాస్ కోర్టు పలు సెక్షన్ల కింద కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News