: గల్లీ, ఢిల్లీలో లేని పార్టీతో తెలంగాణ ఎలా వస్తుంది?: ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
గల్లీ, ఢిల్లీలో లేని పార్టీతో తెలంగాణ ఎలా వస్తుందని ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పరోక్షంగా టీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. ఎంపీ వివేక్ మొదటి నుంచి కాంగ్రెస్ వారేనని చెప్పారు. ఈ ఉదయం ఎంపి వివేక్ ను ఆయన నివాసంలో లక్ష్మారెడ్డి కలుసుకున్నారు. వివేక్ టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ వార్తలు వచ్చినందున లక్ష్మారెడ్డి ఆయనతో భేటీ అయి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. అనంతరం లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లోనే ఉండాలని వివేక్ ను కోరినట్లు చెప్పారు.