: సరస్వతీ పుష్కరాలు ఆరంభం


తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఇవి నేటి నుంచి నెల రోజుల పాటు అంటే జూన్ 30 వరకూ జరుగుతాయి. ఈ నేపథ్యంలో అధికారులు భక్తుల స్నానాలకు, స్వామి దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు కొలువై ఉండడం ఇక్కడి విశిష్టత. భారతదేశంలో ఏ ఆలయంలోనూ పరమేశ్వరుడు ఇలా దర్శనమివ్వడు. ఇక్కడి రెండు శివలింగాలలో ఒకరు కాళేశ్వరుడైతే మరొకరు ముక్తేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రం సమీపంలోనే ప్రాణహిత నది గోదావరితో సంగమిస్తుంది. సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంటుందని చెబుతారు. ఈ త్రివేణీ సంగమ క్షేత్రంలోనే సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News