: హెలిస్కామ్ దర్యాప్తును నీరుగార్చే కుట్ర
అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో బీజేపీ పేరును తీసుకురావడం వెనుక దర్యాప్తును నీరుగార్చే కుట్ర దాగుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించి, నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆయన హైదరాబాద్ లో డిమాండ్ చేశారు. అప్పడే వాస్తవాలు వెల్లడి అవుతాయన్నారు.