: నాగం బాటలోనే మరో నేత


తెలుగుదేశం పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జిగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో జూన్ 3న చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మర్రి జనార్దన్ రెడ్డి కూడా బీజేపీలో చేరి నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News