: అమెరికా, చైనా తర్వాత మనమేనట!
ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక శక్తులుగా రూపుదిద్దుకుంటున్న దేశాల్లో తొలి రెండు దేశాలుగా అమెరికా, చైనా దేశాలు నిలిచాయి. మూడవ దేశం మన భారతదేశమేనట. ఈ విషయాన్ని పారిస్‌కు చెందిన మేధోమధన సంస్థ ఓఈసీడీ బుధవారం నాడు ప్రకటించింది.
గతంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశాల్లో తొలి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్ దేశాలు ఉండేవని, అయితే జపాన్‌ను కిందికి నెట్టి భారత్ మూడవ స్థానాన్ని ఆక్రమించిందని ఈ సంస్థ వెల్లడించింది. 2020 వరకు ప్రధాన దేశాల్లో చైనా మరింత వృద్ధిరేటును నమోదు చేసే అవకాశం ఉందని, ఇలాగే జరిగితే మరి కొన్నేళ్లలో అమెరికాను అధిగమించి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక శక్తిగా అవతరించవచ్చని కూడా ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది. మరి కొన్నేళ్లలో భారత్ మరింత వృద్ధిరేటును నమోదు చేసుకుంటుందని కూడా ఈ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది