: కర్ణాటక కొత్త అసెంబ్లీ కళకళ


బెంగళూరులో కర్నాటక 14 వ శాసనసభ కొలువుదీరింది. మెన్న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 223 మందిలో 146 మంది ఈ రోజు ప్రమాణం చేసారు. మిగిలిన వారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ గా కాగోడు తిమ్మప్పను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు. తొలి రోజు కొత్త సభ్యుల పలకరింపులతో అసెంబ్లీ కళకళలాడింది. జగదీష్ శెట్టర్, యడ్యూరప్పలు సీఎం సిద్దరామయ్యను పలకరించారు. మొదటి రోజు సిద్దరామయ్య బద్ద శత్రవు కుమార స్వామి హాజరు కాలేదు. బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ స్కూటర్ మీద వచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News