: తీహార్ లో తోలి రోజు
స్పాట్ ఫిక్సంగ్ కుంభకోణంలో అరెస్టై తీహారు జైలుకు తరలించబడిన క్రికెటర్ శ్రీశాంత్ రాత్రంతా నిద్రపోలేదని జైలు అధికారులు తెలిపారు. పోలీస్ కస్టడీని తిరస్కరించి జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలన్న కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శ్రీశాంత్ ను తీహార్ లోని ఒకటో నెంబరు జైలుకు తరలించారు. బుధవారం ఎవరూ శ్రీశాంత్ ను కలుసుకోలేదని, అతను ఇతర ఖైదీల మాదిరిగానే అన్నం, పప్పుచారుతో భోజనం చేశాడని తెలిపారు. ఉదయం బిస్కెట్స్ తిని టీ త్రాగాడని, రాత్రంతా నిద్రపోకుండా గడిపాడని జైలు అధికారులు కలిసారు.