: జూన్ 14 న ఛలో అసెంబ్లీ: టీజాక్
జూన్ 14 న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. టీఎస్ జీవో భవన్ లో జరిగిన రాజకీయ జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని లక్షలాదిగా వచ్చి విజయవంత చేయాలని కోదండరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛలో అసెంబ్లీ కోసం జూన్ 1 నుంచి బృందాలుగా ఏర్పడి ప్రచారం చెయ్యాలని తెలిపారు.