: బీసీసీఐ ప్రతిష్ఠ దిగజారింది


బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు పెట్టాలన్న వినతిని ముంబై న్యాయస్థానం స్వీకరించింది. నరేష్ మఖాని అనే వ్యక్తి తాను ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనుక్కున్నానని, ఐతే, ఫిక్సింగ్ వార్తలతో తాను మోసపోయానని ఈ కేసును వేసారు. ఆయన దరఖాస్తును కోర్టు మే 31న విచారించనుంది. మరో వైపు శ్రీనివాసన్ రాజీనామా చేయాలని ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ డిమాండ్ చేసారు. శ్రీనివాసన్ వల్ల బీసీసీఐ ప్రతిష్ఠ దిగజారిందని, ఐపీఎల్ మ్యాచ్ లన్నీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసును కేంద్ర హోం శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు.

  • Loading...

More Telugu News