: నగరానికి ఇంకా భద్రత ముప్పు వీడలేదు: లోక్ సత్తా


దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల తరువాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని లోక్ సత్తా ఆరోపించింది. హైదరాబాద్ లో దారుణాలు జరుగుతున్నా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయకపోవడంపై లోక్ సత్తా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేసింది. సీసీ కెమేరాల ఏర్పాటు ఆలస్యం కారణంగా నగరానికి భద్రత ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం గొప్పలుపోతోంది తప్ప అమలులో చూపించడం లేదని ఆక్షేపించారు. ఆర్టీఐ చట్టం ప్రకారం తాము సేకరించిన వివరాల ప్రకారం హైదరాబాద్ కమీషనరేట్ పరిథిలో కేవలం 370 సీసీ కెమేరాలుండగా అందులో 51 కెమేరాలు పనిచెయ్యడం లేదని తెలిపారు. తాము సేకరించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన లోక్ సత్తా నేతలు, ముందుగా కెమేరాలు సమకూర్చి తరువాత ఆ నిధులను భర్తీ చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News