: బీజేపీ, మావోయిస్టులు కలిసి పనిచేస్తున్నారు: ఏఐసీసీ
తమ స్వార్థంకోసం బీజేపీ, మావోయిస్టు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్తి చరణ్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతలపై దాడి గురించి ఆ ప్రభుత్వం దగ్గర సమగ్ర సమాచారం ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను భయపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం వారికి రక్షణ కల్పించలేదన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యలకు గురయ్యారని తెలిపారు. బీజేపీ, మావోయిస్టుల మధ్య సంబంధాలు ఉన్నాయనేందుకు చత్తీస్ గఢ్ ఘటనే సాక్ష్యం అన్నారు.