: సమాజానికి ఏం నేర్పుతున్నారు?: సినిమా టైటిల్స్ పై జడ్జి ఆగ్రహం


తమిళ సినీ టైటిల్స్ కి అర్థాలు ఏంటంటూ మద్రాసు హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎన్ కిర్బాకరన్ సినీ నిర్మాతలు, నటులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమాలకు పెట్టే పేర్లు, వారికి పెట్టుకునే బిరుదులు సాంస్కృతిక విచ్ఛిన్నానికి పాల్పడుతున్నాయంటూ చురకలంటించారు. మీరు పెట్టే పేర్లతో సంఘవిద్రోహ శక్తులను పెంచి పోషిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పోకిరి, మన్ కత్త, మదన మామ, తిరుట్టు పయలే వంటి సినిమా పేర్లు చూసి, ఏంటా పేర్లంటూ ప్రశ్నిచారు. అజిత్ సినిమా 'మదిసర్ మామి' సినిమా బ్రాహ్మణులను కించపరిచేదిగా ఉందంటూ తక్షణం టైటిల్ మార్చాలంటూ ఆదేశిస్తూ, సినిమా విడుదలపై ఆయన స్టే ఇచ్చారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డు ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే 'మదిసర్ మామి' సినిమా టైటిల్ మార్చాలని సూచిస్తూ అడల్ట్ మూవీగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలిపారు సెన్సార్ బోర్డు సభ్యులు. దీంతో సినిమాల మీద చట్టం చేసే పరిస్థితి తీసుకురావద్దంటూ ఆయన సూచించారు. సినిమాటోగ్రఫీ యాక్టును గౌరవించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News