: హైదరాబాద్ లో వర్షం పడిందోచ్....
గత కొన్నాళ్ళుగా భానుడి ప్రతాపంతో తల్లడిల్లిన హైదరాబాద్ ఒక్క సారిగా చల్లబడింది. ఉదయం నుంచే వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచీ ఓ మాదిరిగా చిరుజల్లులతో పలకరించిన వర్షం రాంకోఠి, బొగ్గుల కుంట, అబిడ్స్, కాచిగూడా చౌరస్తా లను తడిపి ముద్దచేసింది. వర్షం ధాటికి బషీర్ బాగ్ లో ఒక హోర్డింగ్ కూలింది. కాగా మరిన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.