: ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ సైట్లో దొంగలు పడ్డారు
కొందరు అక్రమార్కులు ఆర్టీసీకి కన్నం వేశారు. ఆన్ లైన్ రిజర్వేషన్ సైట్ కు సంబంధించిన యూజర్ ఐడి, పాస్ వర్డ్ ను విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్టీసీ రిజర్వేషన్ల కేంద్రం నుంచి తస్కరించి అక్రమంగా ఆన్ లైన్లో రిజర్వేషన్లను జారీ చేశారు. ఆ తర్వాత ఆ టికెట్లను హైదరాబాద్, విజయనగరం పలు ప్రాంతాలలోని రిజర్వేషన్ కేంద్రాలలో రద్దు చేసుకుని నగదుగా పొందినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్, విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై మాన్యువల్ టాపప్ పద్ధతిలో కాకుండా జూన్ 1 నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఆన్ లైన్ రిజర్వేషన్లకు అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.