: రూపీ @ 56.18
రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ 56.18 వద్ద ట్రేడవుతోంది. నిన్న 55.96 వద్ద క్లోజవగా ఈ రోజు అంతకంటే 22 పైసలు తక్కువలో ట్రేడవుతోంది. ఇది 9 నెలల కనిష్ఠ స్థాయి. సాధారణంగా నెల చివర్లో దేశీయ ఎగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ ఉంటుంది. దీనికితోడు డాలర్ బలపడుతుండడం కూడా రూపాయి విలువ పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు.