: మీ పిల్లలకు నిద్రా సమయాన్ని మీరే చెప్పండి!


ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అనే విషయాన్ని తల్లిదండ్రులే తమ పిల్లలకు చెప్పి అలవాటు చేస్తే మంచిదని కెనడాకు చెందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నిర్ణీత సమయంలో నిద్ర పోవడం అనేది పిల్లలకు చిన్న తనం నుండే అలవాటు అవుతుందని వారు చెబుతున్నారు. చిన్నారులు రాత్రి వేళల్లో ఎంత సమయం నిద్రపోతారు? అనే విషయం వారి జన్యువుల ఆధారంగా ఉంటుందని వారు చేసిన పరిశోధనలో తెలిసింది.

సాధారణంగా కొందరు పిల్లలు రాత్రి వేళల్లో ఎక్కువ సమయం మేలుకొని ఉంటారు. మరికొందరు ఇలా పొద్దువాలగానే అలా నిద్రపోతారు. దీనికి కారణం వారి జన్యువులేనని శాస్త్రవేత్తలు తేల్చారు. పగటి సమయంలో చిన్నపిల్లలు నిద్రపోయే సమయం అనేది వారు నిద్రపోయే సమయంలో ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, అయితే రాత్రి సమయంలో పిల్లలు ఎంతసేపు నిద్రపోతారు అనేది వారి జన్యువులను బట్టి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే ఎలాంటి జన్యువులు దీనికి కారణం అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనాల్సి ఉంది. అందుకే ఏడాది వయసునుండే నిర్ణీత వయసులో పిల్లలు తమంతట తాము నిద్రపోవడం వారికి అలవాటు చేయడం మంచిదని వారు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News