: ప్రాణాలు తీసే పరిశ్రమలు మాకొద్దు: మేనకూరు గ్రామస్థులు


ప్రాణాలు తీసే రసాయన కర్మాగారాలు తమకొద్దంటూ నెల్లూరు జిల్లా నాయడుపేట మండలం మేనకూరు గ్రామస్థులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. పంటల సాగుకు ఆటంకం కలిగించే నీటికాలుష్యం, వాయు కాలుష్యంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే కర్మాగారాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ స్థానికులు అధికారులను నిలదీసారు. గతంలో రసాయన కర్మాగారాల ఏర్పాటును వ్యతిరేకిస్తే కొత్తవాటిని నిర్మించడమేంటని ఏపీఐఐసీ అధికారులను ప్రశ్నించారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. అనంతరం డీఆర్వో, గూడూరు సబ్ కలెక్టర్ గ్రామస్థులతో సమావేశమయ్యారు. అయితే పరిశ్రమను నిర్మించేందుకు తాము అంగీకరించమంటూ గ్రామస్థులు స్పష్టం చేసారు.

  • Loading...

More Telugu News