: పద్మావతీ అమ్మవారికి రూ.19 లక్షల కాసుల మాల
తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి 19 లక్షల రూపాయల విలువ జేసే బంగారు కాసుల మాలను చెన్నైకు చెందిన ఓ భక్తురాలు సమర్పించారు. 610 గ్రాముల బంగారు మాలపై 60 లక్ష్మీ కాసులు పొదిగి ఉన్నాయి. దీనిని చెన్నై భక్తురాలు ఆలయ అధికారులకు ఈ రోజు సాయంత్రం అందజేశారు. దీనిని అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సేవల సందర్భంగా అలంకరించనున్నారు.