: ఆశ్రయమిస్తే అంతం చేసేశారు


ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లోని ఒక పోలీస్ చెక్ పోస్టువద్ద ఇద్దరు అగంతకులు రాత్రికి ఆశ్రయమివ్వమని పోలీసులను కోరారు. వారి విన్నపాన్ని మన్నించిన పోలీసులు వార్ని లోనికి రానిచ్చి, ఆహారం కూడా పెట్టారు. ఆ తరువాత అర్ధరాత్రి పోలీసుల ఆయుధాలను లాక్కుని ఎడాపెడా కాల్పులు జరిపి ఏడుగురు పోలీసుల ప్రాణాలు తీసి పారిపోయారా దుండగులు. మంచికెళ్తే చెడు ఎదురౌతుందంటే ఇదేనేమో మరి!

  • Loading...

More Telugu News