: శ్రీశాంత్ టాటూ ఖరీదు 5 లక్షలు
మన ఊళ్ళో పచ్చబొట్టుకి ఎంత తీసుకుంటారు... మహా అయితే ఐదో, పదో రూపాయలు తీసుకుంటారు. అదే యూత్ వేయించుకునే టాటూకి వె్య్యో రెండు వేలో తీసుకుంటారు. కానీ శ్రీశాంత్ కుడిచేతి పై ఉండే టాటూ ఖరీదు అక్షరాలా 5 లక్షలు. టాటూకి అంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారా? ఆ టాటూ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో 2.5 లక్షలిచ్చి మరీ వేయించుకున్నాడు. అయితే ఇదే టాటూ రెండో దశ ముంబైలో పూర్తి చేయించుకునేందుకు మరో 2.5 లక్షలు ఇచ్చాడు. అలా ఒక్క టాటూకే 5 లక్షలు వెచ్చించాడు. మరో లక్షా 95 వేలిచ్చి 19 జీన్ ఫేంట్లు కూడా షాపింగ్ చేసాడు. అంతే కాకుండా లవర్ కి ఫిక్సింగ్ దందా డబ్బుతో రెండు బ్లాక్ బెర్రీ ఫోన్లు కూడా కొన్నాడు. విశేషమేంటంటే, వీటన్నింటికీ మొత్తం నగదు రూపంలోనే బిల్లు చెల్లించాడు. ఎక్కడా క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ వాడలేదు.