: రాజ్ థాకరేపై ఉద్దవ్ థాకరే హాట్ కామెంట్స్


మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే తమ కూటమిలో చేరాలని బీజేపీ, ఆర్పీఐ పార్టీలను ఆహ్వానించడం హాస్యాస్పదమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అన్నారు. ఇలాంటి కూటమిని మహరాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదన్నారు. అన్నింటినీ కలిపి తయారు చేసిన రుచి లేని కిచిడీని మహారాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు సుస్థిర, సమర్ధవంతమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, అంతటి సామర్థ్యం ఒక్క శివసేనకు మాత్రమే ఉందని సామ్నా పత్రికకు రాసిన సంపాదకీయంలో ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News