: మహిళలకు ఆస్తి హక్కు ఘనత అన్నగారిదే: బాలయ్య
మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని నందమూరి బాలకృష్ణ అన్నారు. మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బాలయ్య ప్రసంగించారు. అన్ని వర్గాలు, మతాలకు తెలుగుదేశం సమప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రజలవద్దకు పాలన, సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడ్డాయన్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు.