: భూతాపం అంచనాకు కొత్త పద్ధతి


భూతాపం పెరిగిపోతోంది. అయితే ఎంతమేర పెరిగింది? అనే విషయాన్ని కచ్చితంగా శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు. తాము అనుసరించిన కొత్త పద్ధతితో ఇకపై భూతాపం ఎంతమేర పెరిగింది అనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చని మెల్‌బోర్న్‌, విక్టోరియా విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూతాపాన్ని అంచనా వేయడానికి తాము ఒక కొత్త పద్ధతిని అవలంభించామని, ఈ పద్ధతితో అంచనాలు మరింత కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. బొగ్గుపులుసు వాయువు, ప్రపంచ ఉష్ణ్రోగ్రతల్లో మార్పులను కలిపి పరిశీలించడమే తాము రూపొందించిన కొత్త పద్ధతి అనీ, ఈ పద్ధతి ప్రకారం భూతాపంలో పెరుగుదల ఆరు డిగ్రీలు దాటకపోవచ్చని, రెండు డిగ్రీలు దాటే అవకాశాలు మాత్రమే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News