: ఈ టాయిలెట్లు ఐదు నిమిషాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు!


టాయిలెట్లు నిర్మించాలంటే కనీసం ఒకటి రెండు రోజులైనా పడుతుంది. అయితే ఈ టాయిలెట్లను నిర్మించుకోవడానికి కేవలం ఐదు నిమిషాలే చాలు అంటోంది కోల్‌కతాకు చెందిన ప్రోమిత సేన్‌. అంతేకాదు, తాను దీన్ని ఉపయోగిస్తున్నానని, ఇప్పటికే అమరనాధ్‌ యాత్ర, కుంభమేళా లాంటి ప్రదేశాలతోబాటు ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో కూడా ఈ టాయిలెట్లు చక్కగా ఉపయోగపడ్డాయని ప్రోమిత అంటోంది.

మనదేశంలో చాలా వరకూ పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. వీటి నిర్మాణం కోసం ఎన్ని ప్రాజెక్టులు రూపొందించినా వాటి అమలు అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి సమస్యలకు తాను రూపొందించిన ఈ పోర్టబుల్‌ టాయిలెట్లు చక్కటి పరిష్కారంగా చెబుతోంది ప్రోమిత. ఈ పోర్టబుల్‌ టాయిలెట్లు ఇప్పటికే నైరోబి, బంగ్లాదేశ్‌, సూడాన్‌ లాంటి దేశాలకు కూడా ఎగుమతయ్యాయని, టార్పాలిన్‌ షీట్లతో తయారు చేసిన వీటిలో గాలీ, వెలుతురు రావడానికి అవసరమైన ఏర్పాట్లున్నాయని, ముందే భూమిలో తవ్విన గొయ్యి దగ్గర వీటిని సులభంగా అమర్చుకోవచ్చని, అంతే సులభంగా వీటిని విప్పేయవచ్చని ఆమె చెబుతోంది. ప్రోమిత రూపొందించిన ఈ టాయిలెట్లు దూర ప్రయాణాలు చేసేవారికి బాగా ఉపయోగపడతాయి.

  • Loading...

More Telugu News