: మొండిగా వెళ్లారు... ముప్పు ముంచుకొచ్చింది: రమణ్ సింగ్
ఛత్తీస్ గఢ్ దాడి ఘటనలో భద్రతా వైఫల్యమే కొంప ముంచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. మావోయిస్టు దాడి ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, అయితే బస్తర్ ప్రాంతంలో ముప్పు ఉందని ముందుగానే హెచ్చరికలు చేసామని, కానీ నేతలంతా మొండిగా ముందుకే వెళ్లారని రమణ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం హెచ్చరించినా నిర్లక్ష్యం చెయ్యడంతోనే ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడ్డారు.