: మూడు రోజుల జపాన్ పర్యటనలో ప్రధాని మన్మోహన్
ప్రధాని మన్మోహన్ సింగ్ మూడు రోజుల జపాన్ పర్యటనకు టోక్యో చేరుకున్నారు. పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షింజో ఎబెతో మన్మోహన్ సింగ్ బుధవారం విస్తృత చర్చలు జరుపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడటమే ధ్యేయంగా వీరి చర్చలు జరుగనున్నాయి. మరో వైపు ఇంధన కొరతను అధిగమించేందుకు పౌర అణు ఇంధనానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోనున్నాయి. రెండు దేశాలు దౌత్యపరంగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. తాజాగా చైనా నౌకలు జపాన్ జలాల్లో ప్రవేశించడంపై కూడా చర్చించనున్నాయి. అంతర్జాతీయ సమాజంలో ఎదుగుతున్న శక్తిగా భారత్ కు మంచి పేరుప్రతిష్టలుండగా, అభివృద్ధి చెందిన దేశంగా జపాన్ కు పేరుంది. మరో వైపు చైనాతో సరిహద్దు సమస్యలు భారత్, జపాన్ దేశాలకు ఉన్నాయి.