: మధుయాష్కీ అవాకులు చవాకులు పేలుతున్నారు: టీఆర్ఎస్ శ్రావణ్
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరుతున్నారన్న అక్కసుతోనే కేసీఆర్ పై మధుయాష్కీ అవాకులు చవాకులు పేలుతున్నారని టీఆర్ఎస్ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ విమర్శించారు. 'మీకు చేతనైతే పార్టీ వీడకుండా వారిని ఆపాలి కానీ, ఉద్యమనేతపై విమర్శలు చేస్తే తెలంగాణ వాదులు సహించ'రన్నారు. సోనియా, రాహుల్ ముందు నోరువిప్పలేని మధుయాష్కీ, టీఆర్ఎస్ ను ఉద్యమం చెయ్యాలనడం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ తో కేవీపీకి సంబంధాలు అంటగడుతున్న యాష్కీ దమ్ముంటే ఎమ్మార్ ప్రాపర్టీస్ లో కేవీపీ చేపట్టిన విల్లా నిర్మాణం ఆపాలని డిమాండ్ చేసారు. కేసీఆర్ ది నోట్లు-ఓట్లు-సీట్ల దందా అని మాట్లాడిన లగడపాటి మౌత్ పీస్ అని ఆరోపించారు.