: ముగిసిన తానా 19 వ ద్వైవార్షిక మహోత్సవాలు
గత మూడు రోజులుగా అమెరికాలోని ప్రవాసాంధ్రులందర్నీ అలరించిన తానా ద్వైవార్షిక మహాసభలు నేటితో ముగిసాయి. తానా 19 వ వార్షికోత్సవాలకు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులందర్నీ ఆహ్వనించి, తామంతా ఐకమత్యంగా ఉన్నామన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి శభాష్ అనిపించుకున్నారని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు అభినందించారు. వైవిధ్యభరితంగా చక్కని తెలుగు సంప్రదాయ బద్ధంగా మహాసభలను నిర్వహించిన నిర్వాహకులను అందరూ అభినందించారు.
ఈ ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రవాసాంధ్రులు, కళాకారులు, రాజకీయనాయకులు, సినీనటులు హాజరై పండగ వాతావరణాన్ని తీసుకువచ్చారని అమెరికాంధ్రులు హర్షం వ్యక్తంచేసారు. కులమత వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి ఉన్నామని ప్రవాసాంధ్రులు తెలిపారు. విద్యాసంస్థల అధినేత, ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు నటవిరాట్ బిరుదు ప్రదానం చేసి అభినందించారు. అలాగే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి గౌరవ అవార్డు అందజేసారు.