: ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ
తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎన్జీసీ పైప్ లైన్ లీకైంది. భూ అంతర్భాగం నుంచి వెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ పగిలి చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఇది గమనించిన ఓ ఆకతాయి దానిపై అగ్గిపుల్ల గీశాడు. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీన్ని ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఇంతలో కరప రెవెన్యూ అధికారులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం అందించడంతో ఆ పైపు లైన్ కి సంబంధించిన మెయిన్ వాల్వ్ కట్టివేయడంతో లీకేజీని అరికట్టారు. కాగా ఈ లైన్ 20 సంవత్సరాల క్రితం వెయ్యడంతో పైప్ ఎప్పటికప్పడు పగిలి గ్యాస్ పైకి విరజిమ్ముతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.