: మావోయిస్టుల దాడి అనాగరికం: ధర్మాన


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడిని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాససన సభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఖండించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేనివారు ఇలాంటి చర్యలకు పాల్పడతారని, తుపాకులతో హింసను సృష్టించడం సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. నెహ్రూ వర్ధంతి పురస్కరించుకుని శ్రీకాకుళం ఇందిరా విజ్ఞానభవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాగా కన్నెధార కొండను ఆక్రమించుకున్నందుకు, స్థానిక గిరిజనులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకోవడంతో ధర్మాన కూడా మావోల లిస్టులో ఉన్నారన్న అంతర్గత వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News