: మార్కెట్లోకి మహీంద్రా పాంటెరో బైక్
ద్విచక్రవాహన విభాగంలో మహీంద్రా సంస్థ సత్తా చాటేందుకు రంగం సిద్దం చేసింది. మోటారు రంగంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన మహీంద్రా ట్రాక్టర్లు, భారీ వాణిజ్య వాహనాల తయారీలో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే చతుశ్చక్ర వాహనాల్లో తిరుగులేని ప్రత్యేకత చాటిన మహీంద్రా ద్విచక్ర వాహనాల శ్రేణిలో ప్రగతి సాధించేందుకు నడుంబిగించింది. 40 అధునాతన సౌకర్యాలతో మహీంద్రా పాంటెరో బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు విభాగాల్లో, నాలుగు రంగుల్లో ఈ వాహనం లభ్యమవుతుందని, దీని ధర 40,599 నుంచి 44, 599 రూపాయల మధ్య వుంటుందని తెలిపారు. ఈ వాహనాలు లీటరు పెట్రోలుకు 79.4 కిలోమీటర్ల దూరం మైలేజీ ఇస్తుందని తెలిపారు.