: గోవాలో ఫిక్సింగ్ ముఠా అరెస్టు
స్పాట్ ఫిక్సింగ్ ముఠాలు దేశవ్యాప్తంగా అల్లుకున్నాయి. ముంబై, చెన్నై కేంద్రంగా నిర్వహించిన బెట్టింగు ముఠాలు అక్కడ నిఘా ఎక్కువవడంతో తమ స్థావరాలను మార్చుకుంటున్నాయి. తాజాగా భారీ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను గోవా పోలీసులు అరెస్టు చేసారు. గోవాలో గత 45 రోజులుగా బెట్టింగ్ కు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠా ముంబైకి చెందినదిగా గుర్తించారు. పోలీసులు వీరినుంచి సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.