: సమస్యలపై గళమెత్తిన చంద్రబాబు


రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అసమర్థత వల్లే సమస్యలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, విద్యుత్ లేక పరిశ్రమలు మూతపడ్డాయిని, 30లక్షల మంది ఉపాధిని కోల్పోయారని అన్నారు. వ్యవసాయం దెబ్బతిందని, 9ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 22,500 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అమ్మహస్తం, మొండి హస్తమంటూ తానన్న వ్యాఖ్యలు నిజమయ్యాయని చెప్పారు. మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News