: మహానాడు ఆరంభం.. హరికృష్ణ, బాలకృష్ణ, లోకేష్ హాజరు


2014 ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసే ప్రధాన అజెండాగా తెలుగుదేశం మహానాడు కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని గండిపేటలో ఆరంభమైంది. అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరణతో దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. కొన్నాళ్లుగా పార్టీతో ఎడముఖం, పెడముఖంగా ఉంటున్న హరికృష్ణ కూడా వచ్చారు. బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా మహానాడుకు తరలివచ్చారు.

  • Loading...

More Telugu News