: స్నేహానికి అసలైన భాష్యం!
స్నేహానికి కొత్త భాష్యం చెప్పాడో గొప్ప మనసున్న స్నేహితుడు. బీహార్ లోని పాట్నాకు చెందిన ఈ వ్యక్తి నిజమైన స్నేహమంటే ఏంటో రుచి చూపించాడు. సామూహిక అత్యాచారానికి గురైన స్నేహితురాలికి అండగా నిలిచి శభాష్ అనిపించుకున్నాడు. గత వారం బంకా జిల్లాలో ప్రసిద్ద మందర్ పర్వతాన్ని చూసేందుకు వెళ్లారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. దారి చెప్పమని కొందరు గొర్రెల కాపరులను అడిగినందుకు మూడు గంటల పాటు నిర్భందించి అత్యాచారం చేసి ఆమె స్నేహితుడ్ని కొట్టారు ఆ కిరాతకులు. దీంతో వారిద్దరూ దగ్గర్లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెను ఆ మిత్రుడు కోర్టులో పెళ్లి చేసుకున్నాడు. తరువాత యువతి తండ్రి, బంధువుల సమక్షంలో ఒక దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకుని తన గొప్పతనాన్ని చాటాడు.