: 12 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం
రాష్ట్రంలో రోజుకో నకిలీ కరెన్సీ ముఠా పోలీసులకు పట్టుబడుతోంది. మూడు రోజుల వ్యవధిలో నాలుగో ముఠా దొరికిపోయింది. కడప జిల్లాలో నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు ఈ రోజు పట్టుకున్నారు. వారి నుంచి 12 లక్షల రూపాయల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.