: ఆడపిల్లైతే ఇక్కడ ఇంతే...!
ఆడపిల్లలపై దాష్టీకాలు ఆగడం లేదు. కన్నకడుపులే వారిని మింగేసే రాక్షసుల్లా మారుతున్నాయి. తరాలుగా గూడు కట్టుకున్న మూఢవిశ్వాసాలు మనుషుల్ని దానవులుగా మార్చేస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా హైదరాబాదు నగరంలో చోటు చేసుకున్న సంఘటననే చెప్పుకోవచ్చు. నాలుగు రోజుల పసికందును నాలాలో వేసేందుకు ప్రయత్నించిందో అమ్మమ్మ. కేవలం ఆడపిల్ల అన్న కారణంగా ఈ దుశ్చర్యకు పాల్పడిందామె. హైదరాబాద్ దోమలగూడలో నాలాలో పసిబిడ్డను వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆ దుశ్చర్యను స్థానికులు అడ్డుకుని బిడ్డను రక్షించారు.